Telangana 10th Exams |వచ్చే మార్చి నుంచి 10th క్లాస్ పరీక్షలు
Telangana 10th Exams |వచ్చే మార్చి నుంచి 10th క్లాస్ పరీక్షలు
ఉదయం 9.30 గంటల నుంచే పరీక్షలు షురూ
టైంటేబుల్ విడుదల చేసిన విద్యా శాఖ
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు (10 Class Exams) సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి టైంటేబుల్ గురువారం విడుదల చేశారు. ఈ ప్రకటన ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు.
*పది పరీక్షల పూర్తి టైంటేబుల్ వివరాలు ఇలా ఉన్నాయి..
మార్చి 21(శుక్రవారం) – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24(సోమవారం) – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
మార్చి 26(బుధవారం) – గణితం
మార్చి 28(శుక్రవారం) – సైన్స్(ఫిజికల్ సైన్స్)
మార్చి 29(శనివారం) – సైన్స్(బయోలాజికల్ సైన్స్)
ఏప్రిల్ 2(బుధవారం) – సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3(గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
ఏప్రిల్ 4(శుక్రవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2
* * *
Leave A Comment